జనవరిలోనే వస్తున్న.. ‘మజ్ను’

అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’ వెంకీ అట్లూరి దర్శకుడిగా బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో, నిధి అగర్వాల్‌ కథానాయిక. ఈ దేవదాసు మనవడు..మన్మథుడి వారసుడు ‘మిస్టర్‌ మజ్ను’ వచ్చే 2019 జనవరిలో తెరపైకి రానున్నాడు. ఇదే విషయాన్ని కథానాయుడు అఖిల్‌ తన ట్విట్టర్లో.. ‘‘అందరికీ దీపావళి శుభాకాంక్షలు..’’అంటూ ట్వీట్‌ చేస్తూ అందులో ఓ పోస్టర్‌ కూడా పెట్టాడు. ఆ పోస్టర్లో ఒక వైపు తిరిగి స్టైయిల్‌గా సెప్టేస్తూ కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్, టీజర్‌ విడుదలై హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే! ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శిని, జయప్రకాష్, హైపర్‌ ఆది, తదితరులు నటిస్తున్నారు. చిత్రానికి సంగీత దర్శకుడు: తమన్, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, సినిమాటోగ్రఫీ: జార్జీ సి.విలియమ్స్, కొరియోగ్రఫీ: శేఖర్‌.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.