మాటలు రాని లోకంలో.. ఓ డార్క్‌ సూపర్‌ హీరో!

అక్షయ్‌కుమార్‌ వైవిధ్యమైన నటుడు. కమర్షియల్‌ హీరోగా సత్తా చాటుతూనే కొత్త తరహా పాత్రల్లోనూ నటించి మెప్పిస్తున్నారు. రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘2.ఓ’లో ఆయనే ప్రతినాయకుడు. ఆదివారం అక్షయ్‌ పుట్టిన రోజు.ఈ సందర్భంగా ‘2.ఓ’లో తన పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు అక్షయ్‌. ‘‘నా అభిమానులకు నేనిచ్చే బర్త్‌డే పార్టీ ఇదే. నేను నటిస్తున్న ఓ శక్తివంతమైన పాత్రను మీతో పంచుకుంటున్నాను. మాçలే రాని ఓ ప్రపంచానికి నేనో డార్క్‌ సూపర్‌ హీరోని. మనుషులతో జాగ్రత్త’’అని రాశారు అక్షయ్‌. ‘ఈ ప్రపంచం మనుషుల ఒక్కళ్లే కాదు..’అని పోస్టర్‌పై రాసి ఉంది. ఈ చిత్రంలో అక్షయ్‌ కాకిని పోలిన ఓ గెటప్‌లో కనిపిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.© Sitara 2018.
Powered by WinRace Technologies.