వైరల్‌గా అలియా- రణబీర్‌ వెడ్డిండ్‌ కార్డు?

బాలీవుడ్‌ ప్రేమజంట రణబీర్‌ కపూర్, అలియా భట్‌ను వివాహం గురించి ఎవరు అడిగినా నవ్వుతూ.. ఏమో అంటూ సమాధానమిస్తుంటారు. అలాంటిది ఏకంగా వారి వివాహ ఆహ్వాన పత్రిక చూస్తే నిజంగా పెళ్లి చేసుకోబోతున్నారా? ఎప్పుడు అనే ఆసక్తి అందరికీ ఉంటుంది. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం నెట్టింట మాత్రం రణబీర్, అలియా వివాహ ఆహ్వాన పత్రిక అంటూ ఓ ఫొటో వైరల్‌ అయింది. ఇందులో 2020 జనవరి 22న జోథ్‌పూర్‌లో వారి వివాహమని ముద్రించిన ఓ కార్డు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. అయితే ఈ కార్డులో అలియా తండ్రి పేరు మహేష్‌ భట్‌కు బదులుగా ముఖేష్‌ భట్‌ అని ఉండటంతో ఇది నకిలీ ఆహ్వాన పత్రికని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ఇది తెలియని వారందరూ ఇది నిజంగా అలియా, రణబీర్‌ల వెడ్డింగ్‌ కార్డే అని సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్‌ పెడుతున్నారు. ఓ హిందీ పత్రిక ముంబయి విమానాశ్రయంలో ఇదే విషయమై అలియాను అడగ్గా.. ‘దీని గురించి నేను ఏం చెప్పలేను. అది ఫేక్‌’ అని చెప్పిందట.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.