ఆగస్టు 15న బన్నీ సర్‌ప్రైజ్‌!

గస్టు 15న అభిమానులకు బన్నీ సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నాడు. దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అల్లు అర్జున్‌తో ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇది వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం. అందుకే అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర టైటిల్‌ ఇప్పటికీ ఖరారు కాలేదు. ‘అల్లు అర్జున్‌ 19’ వర్కింగ్‌ టైటితోనే షూటింగ్‌ మొదలు పెట్టి సగ భాగం చిత్రీకరణ పూర్తి చేసింది చిత్ర బృందం. తాజాగా టైటిల్‌ను ఆగస్టు 15న రివీల్‌ చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘అలకనంద’, ‘నేను నాన్న’ పేర్లు ఎప్పటి నుంచో పరిశీలనలో ఉన్నాయి. ఈ టైటిల్స్‌లో ఏదైనా పెడతారా? మరో కొత్త పేరు పెట్టి సర్‌ప్రైజ్‌ చేస్తాడో చూడాలి.




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.