బన్నీ - అర్హల అల్లరిలోకి స్నేహ

అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ల కలయికలో తెరకెక్కనున్న మూడో చిత్రం.. మరికొద్ది రోజుల్లోనే సెట్స్‌పైకి వెళ్లబోతుంది. దీనికి మరికొన్ని రోజులే సమయం ఉండటంతో.. ప్రస్తుతమున్న విరామాన్ని తన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గœడుపుతున్నారు స్టైలిష్‌ స్టార్‌. తాజాగా తన ముద్దుల కూతురు అర్హతో బన్నీ చేసిన సరదా సంభాషణ నెట్టింట ఫుల్‌ వైరల్‌గా మారింది. ఇది నెట్టింట ప్రత్యక్షమైన 24 గంటల్లోపే 1 మిలియన్‌ వ్యూస్‌ దక్కించుకుంది. నెటిజన్ల నుంచి లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇప్పుడీ వీడియో నెట్టింట సందడి చేస్తుండగానే మరోవైపు దీనిపై బన్నీ - స్నేహ దంపతుల మధ్య చిలిపి గొడవొకటి జరిగింది. నిన్న బయటకొచ్చిన వీడియోలో అల్లు అర్జున్‌ తన కూతురుతో ‘నాన్న చెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటావు కదూ’ అని అడగ్గా.. దానికి ఆ పాప ‘నేను చేసుకోను’ అని ఫన్నీగా రిప్లై ఇచ్చింది. ఆ తర్వాత బన్నీ ఎంత బతిమిలాడినా కూడా అర్హ తన మాట మార్చలేదు. అయితే ఈ వీడియోను పోస్ట్‌ చేసిన అనంతరం అల్లు అర్జున్‌ సతీమణి స్నేహ స్పందించింది. బన్నీకి ఓ సరదా ప్రశ్న వేసింది. ‘‘నువ్వు చేసుకున్నావా మీ నాన్న చెప్పిన అమ్మాయిని?’’ అని అడగ్గా.. దానికి ఆయన ‘‘అబ్బా చా.. నవ్వు చేసుకున్నావా’’ అని సరదాగా ఎదురు ప్రశ్నించాడు. దీంతో ఇప్పుడా వీడియోతో పాటు వీళ్లిద్దరి చిలిపి గొడవ కూడా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వీరిద్దరి సంభాషణను చూసి మంచు లక్ష్మి, రానా, అల్లు శిరీష్‌ తదితరులు కూడా సరదాగా స్పందిస్తున్నారు. బన్నీ - స్నేహల చాట్‌కు లైక్‌లు, స్మైలీ ఎమోజీలతో బదులిస్తున్నారు.



       





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.