భారత్‌ - పాక్‌ మ్యాచ్‌ను బన్నీ ఇలా చూశాడట!

ప్రపంచ క్రికెట్‌లో భారత్‌ - పాక్‌ మ్యాచ్‌కు ఉన్నంతటి క్రేజ్‌ మామూలుది కాదు. అందులోనూ ప్రపంచకప్‌ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో దాయాదులిద్దరూ తలపడుతున్నారంటే ప్రతి ఒక్కరి చూపూ ఆ మ్యాచ్‌పైనే ఉంటుంది. క్రికెట్‌ ప్రేమికులకు ఆరోజు ఎంతటి ముఖ్యమైన పనులున్నా వాటిని పక్కకు పెట్టేసి టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇక మన సినీ తరాల్లోనూ ఇలాంటి క్రికెట్‌ ప్రియులు అనేక మంది ఉన్నారు. ఇక తాజాగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా భారత్‌ - పాక్‌ మ్యాచ్‌ కోసం సెట్లోనే ప్రత్యేక ఏర్పాటు చేసేసుకున్నాడు. ఏం చేశాడు అనుకుంటున్నాడా.. మరేంలేదు. తన మొబైల్‌లోనే మ్యాచ్‌ చూస్తూ ఫుల్‌గా ఎంజాయ్‌ చేశారు. దీనికి సంబంధించి ఆయన ఉత్కంఠగా ఆయన మ్యాచ్‌ వీక్షిస్తున్న దృశ్యాన్ని కథానాయిక పూజా హెగ్డే వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ‘బన్నీ మొబైల్‌ ఫోన్‌లో మ్యాచ్‌ చూస్తున్నార’ని దానికి కామెంట్‌ కూడా పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత బన్నీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని, గీతా ఆర్ట్స్‌ పతాకంపై సినిమాను నిర్మిస్తున్నారు. తమన్‌ బాణీలు అందిస్తున్నారు.

View this post on Instagram

A post shared by allu arjun fans (@allu_arjun444) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.