ఇటు అల్లూరి.. అటు సాహో.. మధ్యలో సైరా!!

‘సాహో’ నేటితరానికి ప్రతినిధి.. అల్లూరి సీతారామరాజు తెల్లదొరలను హడలెత్తించిన విప్లవ బాణం. ఇక సైరా నరసింహారెడ్డి భారతీయ తొలి స్వాతంత్య్ర సమరయోధుడు. ఈ ముగ్గురు వేరు వేరు కాలాలకు చెందిన గొప్ప వ్యక్తులే. మరి ఈ ముగ్గురు ఒకచోట కలిస్తే ఆ అపురూప దృశ్యం ఎలా ఉంటుంది. దానికి సమాధానమే ఇక్కడ కనిపిస్తున్న చిత్రం. అల్లూరి, సాహో, సైరా ఒక వేదికపై కనిపించి సినీప్రియులకు కనులవిందును అందించారు. తాజాగా ‘సైరా’ టీజర్‌ విడుదల వేడుక కోసం ముంబయి వెళ్లిన చిరంజీవి, చరణ్‌లను ప్రభాస్‌ కలిశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ ముగ్గురు నటిస్తోన్న చిత్రాలపై దేశవ్యాప్తంగా క్రేజ్‌ ఏర్పడింది. ప్రభాస్‌ నటిస్తోన్న ‘సాహో’ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. చిరు కథానాయకుడిగా నటిస్తోన్న ‘సైరా’ అక్టోబరు 2న విడుదల కాబోతుంది. ఇక రామ్‌చరణ్‌ అల్లూరి పాత్రలో నటిస్తోన్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ వచ్చే ఏడాది జులై 30న సినీప్రియుల ముందుకు రానుంది. ఈ మూడు చిత్రాలు తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదలవుతున్నాయి.




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.