అమ్మ, అక్కా ఓ చెల్లి.. అంతా అక్కడే!

ప్రస్తుతం కరీనాకపూర్, కరిష్మాకపూర్‌ తల్లి బబితా, రణధీర్‌ కపూర్‌ అందరూ ఒకేచోట ఉన్నారు. అదే లండన్‌ నగరం. కరీనా కపూర్‌ - సైఫ్‌ అలీఖాన్‌ వీరి ముద్దుల కొడుకు తైమూర్‌ అలీఖాన్‌ గత కొన్నాళ్లుగా వేసవి కాలం సెలవులు విడిది చేస్తూ ఇక్కడే ఉన్నారు. ఇక కరిష్మా కపూర్‌ ఏమనుకుందో తను తన ఇద్దరి పిల్లలను కపూర్‌ను వెంటబెట్టుకొని లండన్‌కి చేరుకొన్నారు. మొత్తం కుటుంబమంతా హాయిగా లండన్‌లో షికారు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను కరీష్మాకపూర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి సందడి చేస్తుంది. అన్నట్లు వీరందరూ ఊరికే రాలేదు. పనిలో పనిగా కరీనాకపూర్‌ ‘అంగ్రేజ్‌ మీడియ్‌’ అనే చిత్రంలో నైనా అనే పాత్రలో నటిస్తుంది. ఇందులో ఇర్ఫాన్‌ఖాన్‌ కూడా నటిస్తున్నారు. చిత్రం షూటింగ్‌ లండన్‌లోనే జరుపుకుంది. కరీనా, కరిష్మాలు ఎంత పెద్దవారైనా సరే కుటుంబంతో కలిసి సందడి చేస్తుంటారు.

View this post on Instagram

A post shared by KK (@therealkarismakapoor) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.