కార్తికేయ పెళ్లి.. జైపూర్‌లో ?

రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. ఈ చిత్రం చిత్రీకరణ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ కుమారుడు కార్తికేయ పెళ్లి పనుల్ని కూడా ఆయన పూర్తిచేస్తున్నారట. మొదట్లో హైదరాబాద్‌లోనే వివాహ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నప్పటికీ, వేదికను జైపూర్‌కు మార్చారట. జైపూర్‌లోని 7 నక్షత్రాల హోటల్లో డిసెంబర్‌ 30న కార్తికేయ-పూజాప్రసాద్‌ల వివాహాన్ని నిర్ణయించారని సినీ వర్గాలంటున్నాయి. మొఘల్‌ చక్రవర్తుల నాటి వైభవాన్ని తలపించేలా ఉన్న హోటల్‌ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. వివాహ వేడుకల్లో టాలీవుడ్, బాలీవుడ్‌ ప్రముఖులు పాల్గొంటారట.© Sitara 2018.
Powered by WinRace Technologies.