బాలయ్య-బోయపాటి సినిమా ఎన్నికల తరువాతే?

బాలకృష్ఱ, బోయపాటి శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో తాజాగా ఓ సినిమా రాబోతోందనే విషయం తెలిసిందే. ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో సెట్స్‌పైకి వెళ్లబోతోందనే వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం చిత్రీకరణ వాయిదా పడింది. ఎందుకంటే ఎన్టీఆర్‌ బయోపిక్‌ ‘మహానాయకుడు’ చిత్రీకరణలో బాలకృష్ఱ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలకు సమయం కూడా దగ్గర పడుతుండటం మరో కారణం. బోయపాటి దర్శకత్వంలో ఇటీవల వచ్చిన ‘వినయ విధేయ రామ’ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని నమోదు చేయలేదు. దీన్నిబట్టి చూస్తే వీరిద్దరి కాంబినేషన్‌ సినిమా ఎన్నికల తరువాతే పట్టాలెక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.