బాలల దినోత్సవానికి బన్నీ సర్‌ప్రైజ్‌..

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ ‘అల వైకుంఠపురములో’ నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజాహెగ్డె కథానాయిక. తాజాగా ఓ ఆసక్తికర విషయం అభిమానులతో పంచుకున్నాడు బన్నీ. నవంబరు 14న బాలల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రంలోని ‘ఓ మైగాడ్‌ డాడీ’ అనే పాట టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సంగీత అభిమానుల్ని విశేషంగా అలరించాయి. ఇప్పుడీ పాట ఎలా ఉండబోతుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది. అభిమానుల అంచనాలను అందుకునేందుకు రేపు ఉదయం 10గంటలకు రాబోతుంది ఆ పాట. ‘ఈ పాటను ప్రతి తండ్రికి అంకితమిస్తున్నాం. వినేందుకు సిద్ధంగా ఉండండి’ అంటూ ట్వీట్‌ చేశాడు సంగీత దర్శకుడు తమన్‌.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.