‘బిగ్‌బాస్‌’ హంగామా ఈసారి వంద రోజులు

ఎన్టీఆర్‌ ప్రయెక్తగా వ్యవహరించిన బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్‌ బాస్‌’ తెలుగునాట ఆదరణకు నోచుకుంది. ఇప్పుడు ‘బిగ్‌ బాస్‌ 2’కి రంగం సిద్ధమవుతోంది. ఈసారి ఎన్టీఆర్‌ స్థానంలో నాని ఈ కార్యక్రమాన్ని నడిపించబోతున్నాడు. ‘బిగ్‌ బాస్‌’ తొలి సీజన్‌ 70 రోజులకు పరిమితమైంది. అయితే ‘బిగ్‌ బాస్‌ 2’ వంద రోజుల పాటు సాగబోతోందని తెలుస్తోంది. 8 నుంచి 10 మంది సెలబ్రెటీలు ఈ షోలో పాలుపంచుకోబోతున్నారు. తరుణ్, గీతామాధురిలాంటి పేర్లు కొన్ని వినిపిస్తున్నాయి. అయితే వాళ్లెవరన్నది త్వరలో తెలుస్తుంది. వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నందుకు నానికి కూడా భారీ ఎత్తున పారితోషికం అందుతోందట. ఆ సంఖ్య కూడా ‘బిగ్‌ బాస్‌’ నిర్వాహకులు గోప్యంగా ఉంచుతున్నారు.


© Sitara 2018.
Powered by WinRace Technologies.