యూరప్‌ వెళ్లనున్న ‘ఉయ్యాలవాడ’
బ్రిటిష్‌ సైన్యంపై నరసింహారెడ్డి పోరాటం ఇంకా ఆగలేదు. ఈమధ్యే 35 రోజులపాటు రాత్రి వేళల్లో పోరాటం చేసిన ఆయన, ప్రస్తుతం కొండ కోనల్లోనూ ఎదురొడ్డి నిలుస్తున్నాడు. ఇదంతా ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం కోసమే. చిరంజీవి కథా నాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతోంది. నయనతార కథానాయిక. సురేందర్‌రెడ్డి దర్శకుడు. రామ్‌చరణ్‌ నిర్మాత. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుగుతోంది. పోరాట ఘట్టాలతో పాటు చిరంజీవి, నయనతార, జగపతిబాబు తదితర తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. జలపాతం, కొండ కోనల నేపథ్యంలో సాగే ఈ సన్నివేశాల కోసం ఓ చిన్నపాటి సెట్‌ని తీర్చిదిద్దారు. పోరాట ఘట్టాలకి రామ్‌లక్ష్మణ్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్‌లో 35 రోజులపాటు రాత్రి వేళల్లో బ్రిటిష్‌ సైన్యం, నరసింహారెడ్డి బృందంపై సాగే పోరాట ఘట్టాల్ని తెరకెక్కించారు. తదుపరి యూరప్‌లోనూ కొన్ని సన్నివేశాల్ని తీర్చిదిద్దనున్నట్టు సమాచారం. వచ్చే యేడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి రత్నవేలు ఛాయాగ్రాహకుడు
© Sitara 2018.
Powered by WinRace Technologies.