జోష్‌ తెచ్చి.‌.‌.‌ జోరు పెంచి.‌.‌.‌
అగ్ర కథా‌నా‌య‌కుల సిని‌మాలు సెట్స్‌పై ఉంటే చిత్ర పరి‌శ్రమలో సందడే వేరు.‌ రూ:‌ వందల కోట్ల వ్యాపారం.‌.‌.‌ వేల‌మం‌దికి ఉపాధి అవ‌కా‌శా‌లతో చిత్రసీమ కళ‌క‌ళగా కని‌పి‌స్తుంది.‌ ఇక చిరం‌జీ‌వి‌లాంటి అగ్ర కథా‌నా‌య‌కుడు సినిమా చేస్తు‌న్నా‌డంటే ఆ సంద‌డికి ఆకా‌శమే హద్దు.‌ ప్రతి సిని‌మా‌తోనూ పరి‌శ్రమ స్థాయిని పెంచ‌గల సమ‌ర్థుడు చిరం‌జీవి.‌ తన రికా‌ర్డుల్ని తానే తిర‌గ‌రాస్తూ తెలుగు బాక్సా‌ఫీసు స్థాయిని పెంచిన ఘనత ఆయ‌నది.‌ రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ‌‘ఖైదీ నంబర్‌ 150’‌ రూ:‌ 100 కోట్ల‌కి‌పైగా వసూళ్లు సాధిస్తే.‌.‌.‌ ఆ తర్వాత సినిమా ‌‘సైరా నర‌సిం‌హా‌రెడ్డి’‌ ఏకంగా రూ:‌ 200‌కోట్ల అంచనా వ్యయంతో సెట్స్‌‌పైకి వెళ్లింది.‌ దీన్ని‌బట్టే అర్థ‌మ‌వు‌తుంది చిరం‌జీవి క్రీజులో ఉన్నా‌డంటే సినిమా ఆట ఎంత రస‌వ‌త్త‌రంగా మారి‌పో‌తుందో! ప్రస్తుతం చిరం‌జీవి తెలుగు చిత్రసీ‌మలో పెద్దన్న పాత్రని పోషి‌స్తు‌న్నాడు.‌ ఒక‌పక్క ఆయన సిని‌మాలు చేసు‌కొం‌టూనే.‌.‌.‌ మరో‌పక్క తన వార‌సుల సిని‌మా‌లకి సంబం‌ధిం‌చిన వ్యవ‌హా‌రాల్ని పర్య‌వే‌క్షిస్తూ ముందుకు సాగి‌పో‌తు‌న్నారు.‌ అలాగే పరి‌శ్రమలో ఏ ఒక్కరు కొత్త ప్రయత్నం చేసినా వాళ్లని ఇంటికి పిలిచి మరీ అభి‌నం‌ది‌స్తు‌న్నారు.‌


ఒక సినిమా అటు ఇటైం‌దంటే చాలు.‌.‌ వెంటనే లెక్కలు మారి‌పో‌తుం‌టాయి చిత్రసీ‌మలో.‌ ఒక యేడాది విరామం వచ్చిం‌దంటే ఇక సరే‌సరి.‌.‌.‌ దాదా‌పుగా మరి‌చి‌పోయే పరి‌స్థితి.‌ పోటీ ఆ స్థాయిలో ఉంది‌ప్పుడు.‌ రోజు‌కొ‌కరు తారా‌ప‌థం‌లోకి దూసు‌కొ‌స్తుం‌టారు.‌ అలాంటి పరి‌స్థి‌తుల్లో అగ్ర కథా‌నా‌య‌కుడు చిరం‌జీవి ఏకంగా తొమ్మి‌దే‌ళ్ల‌పాటు తెరపై కని‌పిం‌చ‌లేదు.‌ ఆయన రీ ఎంట్రీ ఇస్తు‌న్నా‌రంటే ‌‘మళ్లీ మును‌ప‌టి‌లాగా డ్యాన్సులు వేస్తారా? ఫైట్లు చేస్తారా?’‌ అనే సందే‌హాలే.‌ చిరం‌జీవి ఆ సందే‌హా‌ల‌న్నిం‌టినీ పటా‌పం‌చలు చేస్తూ డ్యాన్సులు, ఫైట్లతో అద‌ర‌గొ‌ట్టారు.‌ తొమ్మి‌దేళ్ల తర్వాత కూడా చిత్రసీ‌మలో తన స్థానాన్ని తానే భర్తీ చేయా‌ల‌న్న‌ట్టుగా నెంబ‌ర్‌వన్‌ అని‌పిం‌చు‌కొ‌న్నారు.‌ ఇప్పుడు అందరి దృష్టి ‌‘సైరా నర‌సిం‌హా‌రెడ్డి’‌పైనే! వ్యాపారం పరంగా, వసూళ్ల పరంగా కొత్త రికా‌ర్డుల్ని సృష్టించే చిత్రమ‌వు‌తుం‌దని పరి‌శ్రమ వర్గాలు అంచనా వేస్తు‌న్నాయి.‌

జోరు పెరు‌గు‌తోందా?
చిరం‌జీవి కోసం యువ దర్శ‌కులు క్యూ కడు‌తు‌న్నారు.‌ ఆయన్ని దృష్టిలో ఉంచు‌కొని పలు‌వురు కథలు సిద్ధం చేసు‌కొం‌టు‌న్నారు.‌ వారి ఉత్సాహం చూసి చిరు కూడా జోరు పెంచే ఆలో‌చ‌నలో ఉన్నారు.‌ ‌‘సైరా నర‌సిం‌హా‌రెడ్డి’‌ తర్వాత ఆయన మరింత వేగంగా సిని‌మాలు చేసే అవ‌కా‌శాలు కని‌పి‌స్తు‌న్నాయి.‌ ఇటీ‌వల ‌‘మహా‌నటి’‌ తీసి ప్రేక్ష‌కుల మెప్పు పొందిన నాగ్‌ అశ్విన్‌ చిరం‌జీవి కోసం ‌‘పాతాళ భైరవి’‌లాంటి కథని సిద్ధం చేస్తు‌న్నారు.‌ మరో‌పక్క బోయ‌పాటి శ్రీను, సుకు‌మార్, కొర‌టాల శివ తది‌తర దర్శ‌కులు కూడా చిరం‌జీ‌వితో సినిమా చేయ‌డా‌నికి ఉత్సాహం చూపి‌స్తు‌న్నట్టు సమా‌చారం.‌ పూరి జగ‌న్నాథ్‌ అయితే ఇప్ప‌టికే రెండు మూడు కథలు సిద్ధం చేసు‌కొ‌న్నారు.‌ ‌‘సైరా నర‌సిం‌హా‌రెడ్డి’‌ విజు‌వల్‌ ఎఫెక్ట్స్ కి ప్రాధా‌న్య‌మున్న సినిమా కాబట్టి దాని‌కోసం తప్ప‌ని‌స‌రిగా ఎక్కువ సమయం కేటా‌యిం‌చా‌ల్సిందే.‌ ఆ చిత్రం పూర్త‌య్యాక మాత్రం చిరు ఒకే‌సారి రెండు చిత్రాల్ని పట్టా‌లె‌క్కించే అవ‌కా‌శాలు కని‌పి‌స్తు‌న్నాయి.‌ చిరుతో సినిమా చేయ‌డా‌నికి పలు‌వురు దర్శ‌కులు క్యూలో ఉన్న‌ప్ప‌టికీ, తదు‌పరి అవ‌కాశం మాత్రం నాగ్‌ అశ్వి‌న్‌కే రావొ‌చ్చని సమా‌చారం.‌

విడు‌దల ఖరా‌రైందా?
చిరం‌జీవి కథా‌నా‌య‌కు‌డిగా నటి‌స్తున్న ‌‘సైరా నర‌సిం‌హా‌రెడ్డి’‌ విడు‌దల తేదీ ఖరా‌రైందా? వచ్చే వేస‌వికి ఈ చిత్రాన్ని విడు‌దల చేయా‌లని నిర్ణ‌యిం‌చారా? అవు‌ననే అంటు‌న్నాయి తెలుగు సినిమా వర్గాలు.‌ సురేం‌దర్‌ రెడ్డి దర్శ‌క‌త్వంలో రామ్‌చ‌రణ్‌ నిర్మి‌స్తున్న ఈ సినిమా చిత్రీ‌క‌ర‌ణని వచ్చే జన‌వ‌రి‌లోపు పూర్తి చేసే ఆలో‌చ‌నలో ఉన్నట్టు సమా‌చారం.‌ ఆ తర్వాత నాలుగు నెలల్లో నిర్మా‌ణా‌నం‌తర కార్య‌క్రమాలు, ప్రచార కార్య‌క్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసు‌కు‌రా‌వా‌లని నిర్ణ‌యిం‌చి‌నట్టు సమా‌చారం.‌ విశ్వ‌స‌నీయ వర్గాల సమా‌చారం మేరకు వచ్చే మేలోనే చిత్రాన్ని విడు‌దల చేస్తు‌న్నట్టు తెలి‌సింది.‌ చిత్రాన్ని తెలు‌గుతో పాటు హిందీ, తమిళం భాష‌ల్లోనూ విడు‌దల చేయ‌బో‌తు‌న్నారు.‌ అందుకు తగ్గ‌ట్టు‌గానే తారా‌గ‌ణాన్ని ఎంపిక చేశారు.‌ నయ‌న‌తార, తమ‌న్నా‌లతో పాటు, అమి‌తాబ్‌ బచ్చన్, విజయ్‌ సేతు‌పతి తది‌తర నటులు కీలక పాత్రలు పోషి‌స్తు‌న్నారు.‌
సంబంధిత వ్యాసాలు
  • ప్రేమకు ప్రతిరూపం.. నీవే అమ్మా మాతృదినోత్సవం సందర్భంగా పలువురు తారలు తమ మాతృమూర్తిపై ఉన్న ప్రేమని చాటుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఫొటోల్ని పోస్ట్‌ చేసి, అమ్మ పంచిన ప్రేమాను రాగాల్ని అక్షరరూపంలో అందంగా ఆవిష్కరించారు. అమ్మ కోసం కవులైపోయారు. ప్రముఖ కథానాయకుడు
  • ‘సైరా’ గురువు వచ్చేశారు! అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
  • ‌‘సైరా.‌.‌’‌ కోసం తమన్నా! వానా వానా వెల్లు‌వాయే.‌.‌.‌ అంటూ సాగే చిరం‌జీవి పాటని ‌‘రచ్చ’‌లో రీమిక్స్‌ చేశారు.‌ అందులో రామ్‌చ‌ర‌ణ్‌తో కలిసి ఆడి‌పా‌డింది తమన్నా.‌ మిల్కీ స్టెప్పులు చూసి చిరం‌జీవి కూడా ఫిదా అయి‌పో‌యారు అప్పట్లో! ఆ సినిమా ఆడియో ఫంక్ష‌న్‌లో ఆయన స్వయంగా తమ‌న్నాని మెచ్చు‌కుంటూ, ఆమెతో కలిసి నటిం‌చా‌లని ఉందని చెప్పారు.‌
  • ‘రంగస్థలం’పై నరసింహుడు రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన ‘రంగస్థలం’ కోసం హైదరాబాద్‌ శివార్లలో ఓ పల్లెటూరుని సృష్టించారు. 1985 నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఆ సెట్‌ని రూపొందించారు. ఇప్పుడు అదే సెట్లో ‘సైరా’ అడుగుపెట్టాడు.
సంబంధిత ఫోటోలు
© Sitara 2018.
Powered by WinRace Technologies.