‘ఇస్మార్ట్‌’ కోసం ట్రిపుల్‌ రైడ్‌లో‌.. షాంపైన్‌తో తల స్నానం!

ప్ర
ముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మ తన ప్రియ శిష్యుడు పూరి జగన్నాథ్‌ చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కోసం వినూత్న రీతిలో ప్రచారం చేశారు. తాజాగా ఈ సినిమా చూసేందుకు మూసాపేట్‌లోని శ్రీరాములు థియేటర్‌కు యువ దర్శకులు అజయ్‌ భూపతి, అగస్త్య మంజులతో కలిసి బైక్‌పై ట్రిపుల్‌ రైడ్‌ చేస్తూ వచ్చారు. చిత్రాన్ని వీక్షించిన అనంతరం షాంపైన్‌ బాటిల్‌ను తలపై పోసుకుంటూ సందడి చేశారు. సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దిన పూరి, ఛార్మిలకు కౌగిలింతలతో అభినందనలు తెలియజేశాడు. దీనికి సంబంధించిన వీడియోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు వర్మ. ‘‘నేను పిచ్చోడిని కాదు.. కానీ, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ నన్ను పిచ్చోడిని చేసింది’’ అంటూ ఈ వీడియోలకు ఆసక్తికరమైన వ్యాఖ్యను జోడించాడు ఆర్జీవీ. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.

View this post on Instagram

A post shared by RGV (@rgvzoomin) on

View this post on Instagram

A post shared by RGV (@rgvzoomin) on

సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.