జయలలిత అవతారంలో.. శివగామిని చూశారా..

ప్రస్తుతం తమిళ నాట ప్రముఖ దివంగత నేత జయలలిత బయోపిక్‌ విషయంలో ఉన్నంత పోటీ అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఇప్పుడక్కడ అమ్మ జీవిత కథతో అరడజనుకు పైగా సినిమాలు సెట్స్‌పై ముస్తాబవుతున్నాయి. వీటిలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ప్రాజెక్టుల్లో ఎ.ఎల్‌. విజయ్‌ ‘తలైవి’ ఒకటి కాగా.. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘క్వీన్‌’ మరొకటి. ‘తలైవీ’లో జయగా కంగనా రనౌత్‌ కనిపించబోతుండగా.. గౌతమ్‌ ‘క్వీన్‌’లో రమ్యకృష్ణ అమ్మ పాత్రను పోషించింది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్‌లో రమ్య ముఖాన్ని చూపించలేదు. వేదికపై నుంచోని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా వెనక నుంచి ఆమె లుక్‌ను చూపించారు. దీన్ని తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నారు. త్వరలోనే ఈ సిరీస్‌ రిలీజ్‌ తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.