విడుదలకు ముందే... నెట్టింట్లోకి ‘కాశి’

తమిళ హీరో విజయ్‌ ఆంటోని కెరీర్‌ తొలినాళ్లలో సంగీత దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించి ఆ తర్వాత దర్శకుడిగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘సలీం’, ‘బిచ్చగాడు’, ‘భేతాళుడు’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో టాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్‌ సృష్టించుకున్నాడు. ఇటీవల కాలంలో విజయ్‌ సినిమాలు తమిళంతో పాటుగా తెలుగులోనూ విడుదలవుతున్నాయి. తాజాగా ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘కాళి’. తెలుగులో ‘కాశి’ పేరుతో విడుదలకు సిద్ధమవుతుంది. కిరుతిగ ఉదయనిధి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని.. లెజండ్‌ సినిమా పతాకంపై ఉదయ్‌ హర్ష వడ్డెల, గణేష్‌ పెనుబోతు, ప్రద్యుమ్న చంద్రపతి సంయుక్తంగా తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ నెల 18న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని కొత్త తరహాలో ప్రమోట్‌ చేస్తున్నారు. ఈ సినిమా విడుదల రోజుకు రెండు రోజుల ముందుగానే సినిమాలోని తొలి 7 నిమిషాల సన్నివేశాల్ని యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ద్వారా విడుదల చేయబోతున్నారు. మే 15న సాయంత్రం 6గంటలకు దీన్ని విడుదల చేయనున్నారు.


© Sitara 2018.
Powered by WinRace Technologies.