‘భారతీయుడు 2’.. సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌
వినీతి పరుల గుండెల్లో కత్తి దించేందుకు సేనాపతి మళ్లీ వచ్చేశారు. 90ఏళ్ల వయసుకు చేరుకున్నా అంతే తరగని దేశభక్తితో మరో యుద్ధానికి సిద్ధమయ్యారు. మరి ఈ ప్రయాణంలో ఆయనకెదురైన సవాü™్లంటి? ఈసారి సేనాపతి ముందున్న లక్ష్యాలేమిటి? వంటివి తెలియాలంటే ‘భారతీయుడు 2’ వచ్చే వరకు వేచి చూడక తప్పదు. కమల్‌హాసన్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. సిద్ధార్థ్, వెన్నెల కిషోర్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈరోజు లోకనాయకుడి పుట్టినరోజును పురస్కరించుకోని తాజాగా ఆయన ఫస్ట్‌లుక్‌ ఒకటి నెట్టింట విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో కమల్‌.. సేనాపతి గెటప్‌లో ఓ పెద్ద కమాన్‌ కింద నుంచోని తీక్షణంగా ఆలోచిస్తున్నట్లుగా దర్శనమిచ్చారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.