గర్భవతిగా మారిన ‘మహానటి’!!
హానటి’ చిత్రంతో జాతీయ నటిగా మెరిసింది కీర్తి సురేష్‌. ఇప్పుడీ సినిమాతో వచ్చిన గుర్తింపును కాపాడుకుంటూ వైవిధ్యభరిత కథా చిత్రాలతో కెరీర్‌ను పరుగులు పెట్టించేందుకు సిద్ధమైంది కీర్తి. దీనికి తగ్గట్లుగానే ఒక చిత్రంతో మరొకటి సంబంధం లేకుండా కొత్తదనానికి పట్టం కడుతోంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో ‘క్లాప్‌’, ‘రంగ్‌ దే’, ‘మిస్‌ ఇండియా’ చిత్రంతో పాటు మరో రెండు సినిమాలు ఉన్నాయి. తాజాగా వీటిలో కీర్తితో ప్రముఖ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు నిర్మిస్తోన్న చిత్ర టైటిల్‌ను రివీల్‌ చేశారు. ‘పెంగ్విన్‌’ పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాలో కీర్తి ఓ ప్రయోగాత్మక పాత్రను పోషించబోతున్నట్లు పోస్టర్‌ను బట్టీ తెలుస్తోంది. తాజాగా విడుదలైన ఈ ప్రచార చిత్రంలో కీర్తి డార్క్‌ షేడ్‌లో గర్భవతిగా ఉన్న యువతిగా దర్శనమిచ్చింది. మరి ఆమె ఎందుకిలా మారింది? చిత్ర నేపథ్యమేంటి? వంటివి తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.