పవర్‌ బిల్‌తో బాధపడుతున్న లక్ష్మీరాయ్‌


సా
ధారణంగా హీరోయిన్లు ఫోటో షూట్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తుంటారు. అంతేకాదు తమ సినిమాల ప్రొమోషన్ల సమయంలో లైవ్‌ చాట్‌ ద్వారా అభిమానులకు దగ్గరవుతుంటారు. ఇలా ఎంటర్‌టైన్‌ చేసే వారు వ్యక్తిగత సమస్యల గురించి చెబితే ఎలా ఉంటుంది? సినీ తారలకు ఇబ్బందులు ఉంటాయా అని అనిపిస్తుంది కదా. అవును తెలుగు, తమిళ్, హిందీ... మెరిసిన కథానాయిక లక్ష్మీరాయ్‌కి ఇలాంటి పరిస్థితే ఎదురైందంట! అదేంటంటే.. లక్ష్మీ అదానీ గ్రూప్‌ ఎలక్ట్రిసిటీ వినియోగిస్తుంది. ఒక నెల కరెంటు బిల్లు కడితే తర్వాత నెల నెలకు అది రెట్టింపు అవుతుందని, ఈ సమస్య పరిష్కారానికి అదానీ గ్రూప్‌ కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేస్తే రెస్పాన్స్‌ లేదంటుంది. నాలాగా ఎంత మంది ఇబ్బంది పడుతున్నారో? కష్టపడి సంపాదించిన డబ్బులు వృథా అవుతుంటే బాధగా ఉందని అదానీ ఎలక్ట్రిసిటీ గ్రూపును ట్యాగ్‌ చేసి ట్వీట్‌ చేసింది. దీంతో ఈ పోస్ట్‌ వైరల్‌ కావడమే కాదు అదానీ గ్రూప్‌ నుంచి స్పందన వచ్చింది. వివరాలు తెలియజేస్తే సమస్య గుర్తించి పరిష్కార మార్గం చూపేందుకు ప్రయత్నిస్తామని రీట్వీట్‌ చేసింది. ఎప్పుడూ తన ఫోటోలతో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అమ్మడు సమస్య కోసం ఇలా ట్వీట్‌ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.