బొమ్మ గీయండి... మహేష్‌బాబును కలవండి

సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియంలో టాలీవుడ్‌ నటుడు మిల్కీబాయ్‌ మహేష్‌ బాబు మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏఎంబి మాల్‌లో ఈ నెల 25న ప్రదర్శించబోతున్నారు. తాజా విశేషం ఏమిటంటే మహేష్‌బాబు అభిమానులకు మేడమ్‌ టుస్సాడ్‌ ఓ ఆఫరిచ్చింది. అదేమిటంటే మహేష్‌ అభిమానులు తమలోని సృజనాత్మకతను వెలికితీసి మహేష్‌ బాబు చిత్రాన్ని అందంగా చిత్రీకరించాలి. ఈ చిత్రాలను మేడమ్‌ టుస్సాడ్‌ సింగపూర్‌ సోషల్‌ మీడియా అకౌంట్‌లో అప్‌లోడ్‌ చెయ్యాలి. ఇలా గీసిన చిత్రాల్లో రెండు ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేస్తారు. మార్చి 25 విగ్రహ ప్రదర్శన కార్యక్రమం రోజున వారికి మహేష్‌బాబుని కలిసే అవకాశం కల్పిస్తారు. సో..మహేష్‌ బాబు అభిమానులూ! ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ కుంచెకు పని చెప్పండి. మహేష్‌ బాబుని కలిసి సెల్ఫీ దిగేయండి.




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.