నిద్రరాని వారికి మాధవన్‌ మంత్ర!

‘రన్‌’, ‘సఖి’.. వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాడు నటుడు మాధవన్‌‌. సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో చురుకురుగా ఉండే మాధవన్‌ తాజాగా ఓ అభిమానికి ఇచ్చిన సమాధానం చూస్తే అతని సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ తెలుస్తుంది. ఇంతకు ఏమైందనే కదా సందేహం? శ్రీనివాసన్‌ అనే వ్యక్తి ‘నిద్ర రావడం లేదు. నిద్రలేమికి పరిష్కారం చెప్పండి’ అని మాధవన్‌ను ట్యాగ్‌ చేశాడు. దీనికి ఆయన ఇలా స్పందించాడు. ‘నేను పాత్రలో లీనమై నటించిన కొన్ని సినిమాలు చూడండి’ అని చమత్కరించడంతో నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. ‘మీ సినిమాలు చాలా బావుంటాయి మాధవన్‌ గారు అలా అనకండి. నిజంగా మీ సినిమా చూస్తే మాకు నిద్ర పట్టదు’ అని మరికొందరు కామెంట్స్‌ పెట్టారు. ఈ నేపథ్యంలో మరో యువతి మాధవన్‌ ఫొటో షేర్‌ చేసి ‘మాధవన్‌ మీరెందుకు ఇంత అందంగా ఉన్నార’ని ప్రశ్నించింది. ‘ఇది రెండు సంవత్సరాల ముందు ఫొటో. నాకు ఇప్పుడు అదే అనిపిస్తుంది. అప్పటి అందం ఇప్పుడు ఉంటే బావుండని అంటూ సమాధానం ఇచ్చాడు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.