ముచ్చటైన కుటుంబం
తెలుగు కథానాయకులో మహేష్‌బాబుది ప్రత్యేకమైన శైలి. మహేష్‌కి సినిమా అంటే ప్రాణం. షూటింగ్‌ ఉంటే సెట్లో ఉంటారు. లేదంటే ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో గడుపుతుంటాడు. ఖాళీ సమయం దొరకితే చాలు పిల్లలతో కలిసి సరదాగా ఆడుకుంటుంటారు. దసరా సందర్భంగా మహేష్‌బాబు భార్యాపిల్లలతో కలిసి దిగిన ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగవైరలవుతోంది. ఆఫోటోలో మహేష్‌ కూతురు సితారను ఒడిలో కూర్చోగా, వెనుకవైపు నమత్ర ఇంకో పక్క తనయుడు గౌతమ్‌లు ఉన్నారు. ఆ ఫోటోను చూస్తుంటే ముచ్చటైన కుటుంబం అని పేరు పెట్టేలా ఉంది. ప్రస్తుతం మహేష్‌ ‍‘సరిలేరు నీకెవ్వరు‘ చిత్రంలో ఆర్మీ అధికారిగా నటిస్తున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.