నవంబరు 22 కోసం ఎదురుచూస్తున్నా..

టాలీవుడ్‌ అగ్ర నటుడు నవంబరు 22 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మహేష్‌ అంత ఆసక్తి చూపించేది ‘ఫ్రోజెన్‌ 2’ చిత్రం కోసం. ఎందుకంటే? ఈ సినిమాలోని ప్రధాన పాత్రైన బేబీ ఎల్సాకు మహేష్‌ ముద్దుల తనయ సితార గాత్రం అందించిన విషయం తెలిసిందే. కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోందీ చిత్రం. ఈ సందర్భంగా మహేష్‌ సామాజిక మాధ్యమాల వేదికగా తన కుమార్తెను మెచ్చుకున్నాడు. ‘సితార ఎల్సాలా ఒదిగిపోయింది! తన వాయిస్‌ ఆ పాత్రకు ప్రాణం పోసింది. సితూ పాప నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నవంబరు 22 కోసం ఎదురుచూస్తున్నాన’ని మహేష్‌ తన మనసులో మాట అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పటికే ఆయన కుమారుడు ‘1 నేనొక్కడినే’ చిత్రంతో బాల నటుడిగా పరిచమయ్యాడు. ఇప్పుడు సితార వెండి తెరపై కనిపించక పోయినా.. వినిపించి, అలరించబోతుండటంతో ఆనందోత్సాహంలో ఉన్నారు మహేష్‌ దంపతులు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.