క్రికెటర్‌గా మారిన మహేష్‌ను చూశారా!!

హేష్‌బాబులో గొప్ప నటుడు, నిర్మాత మాత్రమే కాదు.. ఓ అద్భుత క్రికెటర్‌ కూడా ఉన్నారు. అతను ఫ్రొఫెషనల్‌ బ్యాట్స్‌మెన్‌లా సిక్సర్లు, ఫోర్లు బాదేయగలడు.. చక్కటి బౌలర్‌లా వికెట్లు కూల్చగలడు. తాజాగా మహేష్‌లోని క్రికెట్‌ నైపుణ్యాన్ని అభిమానులకు రుచి చూపించాడు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ప్రస్తుతం వీరిద్దరి కలయికలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే కశ్మీర్‌లో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకోని తిరిగి వచ్చింది. అయితే అక్కడ షూటింగ్‌ విరామ సమయంలో మహేష్‌తో కలిసి చిత్ర బృందమంతా సరదాగా క్రికెట్‌ ఆడింది. ఈ మ్యాచ్‌లో ఆయనతో పాటు తనయుడు గౌతమ్, వంశీ, దర్శకులు మెహర్‌ రమేష్, వంశీ పైడిపల్లి కూడా ఆడారు. తాజాగా వీరి క్రికెట్‌ ఆటకు సంబంధించిన వీడియోను అనిల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దీనికి ‘‘గౌతమ్‌ నన్ను అవుట్‌ చేశాడు’’ అంటూ ఏడుస్తున్న ఎమోజీలతో ఓ కామెంట్‌ను కూడా జత చేశాడు. మరి మహేష్‌ క్రికెటర్‌గా ఎలాంటి ధనాధన్‌ షాట్లు ఆడాడో మీరూ ఓసారి చూసేయండి..

View this post on Instagram

A post shared by Anil Ravipudi (@anilravipudi) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.