‘మెహ్రీన్‌ ఈజ్‌ ద బెస్ట్‌’

తన మొదటి సినిమా ఎంపిక కోసం ఫోటోలు పంపమంటే మేకప్‌ లేకుండా ఉండే సాధారణ చిత్రాలను దర్శకుడికి పంపింది. ఆ దర్శకుడు కూడా ఇలాంటి అమ్మాయే తన కథకు కావాలని ఆ అమ్మాయినే కథానాయికగా ఎంపిక చేశాడు. అలా కథానాయికగా మొదటి అవకాశాన్ని చేజిక్కించుకుంది మన హనీ ‘మెహ్రీన్‌’. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో మహాలక్ష్మిలా తెలుగు తెరపై కాలు మోపిన ముద్దుగుమ్మ మెహరీన్‌. మొదటి సినిమాలో అచ్చ పల్లెటూరి తెలుగమ్మాయిలా పల్లెటూరి చీరకట్టులో యవతకు తెగ నచ్చేసింది ఈ సుందరి. మొదటి సినిమా సూపర్‌ హిట్‌ అయిన, మరో అవకాశం రావాటానికి ఏడాదికి పైగా సమయం పట్టింది. ఆ తరువాత నుంచి ఆమె సంవత్సరానికి మూడు, నాలుగు సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ‘‘ హనీ ఈజ్‌ ద బెస్ట్‌’’ అంలూ ఈ ఏడాది ఆరంభంలోనే ‘ఎఫ్‌2’ చిత్రంతో వినోదాల విందు అందించింది. ఈ చిత్రంలో ఆమె పండించిన హాస్యం చిత్రానికే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఈ మహాలక్ష్మి ‘ఎంత మంచి వాడవురా’ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌కి జోడిగా నటిస్తుంది. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా మా ‘మంచి’ హీరోయిన్‌ మెహరీన్‌కి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఆమె కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.







Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.