సినీ ప్రముఖులకు మోదీ ట్వీట్‌

త్వరలో జరుగబోయే ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాథ్యమాలను వేదిక చేసుకొని ట్వీట్లు చేశారు. వీరిలో సినీ రంగం, క్రీడారంగంతో పాటు వివిధ రంగాల ప్రముఖులకు ఆయన ట్వీట్‌ ఇచ్చారు. టాలీవుడ్‌ కథానాయకుడు నాగార్జునకు, కోలీవుడ్‌ హీరో మోహన్‌లాల్‌ ట్విట్టర్‌ ఖాతాకు కూడా ఆయన సందేశాన్ని పంపారు. సామాజిక బాధ్యతతో ప్రజల్లో ఓటు హక్కు పట్ల అవగాహన కల్పించాలనేది ట్వీట్‌ సారాంశం. మోదీ ఇచ్చిన ట్వీట్‌లో ‘‘డియర్‌ మోహన్‌ లాల్, నాగార్జున.. ఎన్నో ఏళ్లుగా మీ నటనతో మిలియన్ల కొద్ది ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు. ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. భారీ స్థాయిలో ఓటర్లలో అవగాహన కల్పించాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చైతన్యం తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.