చైతూ సమంతల ‘మజిలీ’
తెలుగు చిత్రసీమలోని విజయవంతమైన జోడీలలో నాగచైతన్య - సమంతలు కూడా ఉన్నారు. ‘ఏ మాయ చేసావె’, ‘మనం’ లాంటి సూపర్‌ హిట్లు వీరి ఖాతాలో ఉన్నాయి. పెళ్లయ్యాక తొలిసారి ఓ చిత్రంలో కలసి నటిస్తున్నారు. ‘నిన్నుకోరి’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్‌పెద్ది నిర్మాతలు. ఈ చిత్రానికి ‘మజిలీ’ అనే పేరు పరిశీలిస్తున్నారు. బుధవారం నుంచి హైదరాబాద్‌లో షూటింగ్‌ ప్రారంభమైంది. తొలిరోజు నాగచైతన్య - సమంతలపై కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించారు. ‘‘రొమాంటిక్‌గా సాగే వినోదాత్మక చిత్రమిది. చైతూ, సమంతలు భార్యాభర్తలుగా నిజ జీవిత పాత్రలనే పోషిస్తున్నారు. దివ్యాన్ష కౌశిక్‌ మరో కథానాయికగా నటిస్తోంద’’ని చిత్రబృందం తెలిపింది. రావు రమేష్, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్‌.© Sitara 2018.
Powered by WinRace Technologies.