నారా ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది!
అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న నారా చంద్రబాబునాయుడు ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది. అదేనండీ... ‘యన్‌టిఆర్‌’ చిత్రంలో రానా, చంద్రబాబు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందేగా? దానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను వినాయకచవితి సందర్భంగా విడుదల చేశారు. రానా తన ట్విట్టర్లో ‘1984లో చంద్రబాబు ఎలా ఉంటాడో తెలిపే ఫస్ట్‌లుక్‌ ఇది’ అంటూ పోస్ట్‌ చేశాడు. ఇప్పటికే రానాపై కొన్ని సన్నివేశాలను అబిడ్స్‌ ఎన్టీఆర్‌ నివాసంలో చిత్రీకరించారు. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అక్కినేనిగా ఆయన మనవడు సుమంత్, బసవతారకంగా విద్యాబాలన్‌ నటిస్తున్నారు. వైజయంతి పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకుడు. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది.
© Sitara 2018.
Powered by WinRace Technologies.