సంక్రాంతి బరిలో కల్యాణ్‌రామ్‌ చిత్రం

నందమూరి కల్యాణ్‌రామ్‌ వేగేశ్న సతీష్‌ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘ఎంత మంచివాడవురా!’. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై నిర్మితమౌతున్న ఈ సినిమా సంక్రాంతి పండుగకి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కల్యాణ్‌రామ్‌ సరసన మెహరీన్‌ కథనాయికగా నటిస్తుంది. శివలెంక కృష్ణ ప్రసాద్‌ సమర్పణలో వస్తున్న చిత్రానికి ఉమేష్‌ గుప్తా, సుభాష్‌ గుప్తాలు నిర్మాతగా వ్యవహరిస్తుండగా గోపీ సుందర్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాకి విడుదలకి సంబంధించిన పోస్టర్‌న్‌ చిత్ర బృందం విడుదల చేసింది. హీరో కల్యాణ్‌రామ్‌ ట్విట్లర్లో..‘‘సంక్రాంతి పండుగకి థియేటర్లో కలుసుకుందాం..’’అంటూ పోస్ట్‌ చేశారు.

center>


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.