‘దేవదాస్‌’ పండగ మొదలైంది

ఇప్పటిదాకా షూటింగ్‌లతో అంతా బిజీగా ఉన్నాం. ఇప్పుడిక పండగే అంటున్నారు దేవదాస్‌ చిత్ర బృందం. నాగార్జున, నాని నటిస్తున్న చిత్రం ‘దేవదాస్‌’. హాస్యభరితంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. షూటింగ్‌ హడావుడి పూర్తి చేసుకొని మిమ్మల్ని అలరించడానికి సిద్ధమౌతున్నామంటూ నాగార్జున, నానీలు సెల్ఫీలకు ఫోజులిచ్చారు. ఇదే విషయాన్ని నాగార్జున తన ట్విట్టర్లో తెలిపారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. ఇందులో రష్మిక మండన్న, ఆకాంక్ష సింగ్‌ కథానాయికలు. వెన్నెల కిశోర్, అవసరాల శ్రీనివాస్, రావు రమేష్‌ తదితరులు నటిస్తున్నారు.

© Sitara 2018.
Powered by WinRace Technologies.