కొరటాల కెప్టెన్సీలో నాని!

‌చిత్రసీమలో రచయితగా ప్రయాణం మొదలుపెట్టి దర్శకుడిగా పేరుతెచ్చుకున్న కొద్దిమంది దర్శకరచయితల్లో కొరటాల శివ ఒకరు. ‘మిర్చి’, ‌‘శ్రీమం‌తుడు’, ‌‘జనతా గ్యారేజ్‌’, ‌‘భరత్‌ అనే నేను’‌.. ఇలా వరుస హిట్‌లతో అపజయమెరుగని దర్శకుడిగా టాలీవుడ్‌లో దూసుకుపోతున్నాడు కొరటాల.‌ ఈ నేపథ్యంలో ఆయన తదు‌పరి చిత్రం ఎవ‌రితో? అనే విష‌యంపై టాలీ‌వు‌డ్‌లో ఆస‌క్తి‌క‌ర‌మైన చర్చ నడు‌స్తోంది.‌ చిరంజీవి, రామ్‌చ‌రణ్, ప్రభాస్‌.‌.‌.‌ ఇలా చాలా పేర్లు విని‌పి‌స్తు‌న్నాయి.‌ ఇప్పుడు నానితో కూడా ఆయనో చిత్రం చేసే అవ‌కా‌శా‌లు‌న్నా‌యని తెలు‌స్తోంది.‌ కొర‌టాల శివకు అత్యంత సన్ని‌హి‌తు‌డైన సుధా‌కర్‌ ఈ చిత్రా‌నికి నిర్మా‌తగా వ్యవ‌హ‌రి‌స్తా‌రని సమా‌చారం.‌ నాని ప్రస్తుతం నాగా‌ర్జు‌నతో కలసి ఓ సినిమాలో నటి‌స్తు‌న్నాడు.‌ ఇది పూర్తయిన తర‌వాతే.‌.‌ కొర‌టాల సినిమా పట్టా‌లె‌క్క‌వచ్చు.‌


© Sitara 2018.
Powered by WinRace Technologies.