‘యన్‌.టి.ఆర్‌’ రథ సారథిని చూశారా..

బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘యన్‌టిఆర్‌’. ఈ చిత్రానికి సంబంధించిన ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ ఇప్పటికే కొన్ని ఫోస్టర్లను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఓ పాత్రకు సంబంధించి చిత్ర వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. అదే ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి హరికృష్ణ పాత్ర. ఆ పాత్రను ఇప్పుడు హరికృష్ణ తనయుడు నందమూరి కల్యాణ్‌రామ్‌ పోషిస్తున్నారు. సినిమాలో తన పాత్రకు సంబంధించిన ఫొటోను కల్యాణ్‌రామ్‌ అభిమానులతో పంచుకున్నారు. ‘‘30 ఏళ్ల క్రితం మా బాబాయ్‌తో ‘బాలగోపాలుడు’ సినిమాలో బాలుడిలా నటించాను. మళ్లీ ఇప్పుడు.. బాబాయ్.. వాళ్ల నాన్న గారిలా... నేను, మా నాన్నగారిలా’’ అంటూ ప్రచారం రథం దగ్గర ఎన్టీఆర్‌(బాలకృష్ణ)తో కలిసి వెనక్కి తిరిగి ఉన్న ఫొటోను ట్వీట్‌ చేశారు.


© Sitara 2018.
Powered by WinRace Technologies.