‘యన్‌.టి.ఆర్‌’లో మరో కథానాయిక
మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటనా సార్యభౌముడు నందమూరి తారకరామారావు జీవిత కథను ‘యన్‌.టీ.ఆర్‌’ పేరుతో బయోపిక్‌గా రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీరామారావు సతీమణి పాత్రలో విద్యాబాలన్‌ నటిస్తోంది. విద్యాబాలన్‌తో పాటు చాలామంది టాలీవుడ్‌ కథానాయికలు చిన్న చిన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. కథానాయిక సావిత్రి పాత్రను నిత్యానమీనన్, కృష్ణకుమారి పాత్రలో మాళవికా నాయర్, షావుకారు జానకి పాత్రలో షాలినీ పాండే, శ్రీదేవి పాత్రలో రకుల్‌ ప్రీత్‌ సింగ్, జయప్రద పాత్రలో హన్సిక, జయసుధగా పాయల్‌ రాజ్‌పుట్, ప్రభగా శ్రియ.. ఇలా కథానాయికలు సందడి చేయబోతున్నారు. ఇప్పుడు మరో నాయిక కూడా ఈ జాబితాలో చేరింది. తనే.. ఈషారెబ్బా. ఈ తెలుగమ్మాయికి బయోపిక్‌లో ఓ కీలక పాత్ర దక్కిందని సమాచారం. మరి ఆమె ఎవరి పాత్రలో దర్శనమిస్తుందో చూడాలి. ఒక్క బయోపిక్‌లో ఇంతమంది కథానాయికలు నటించడం ఆసక్తిదాయకమే.© Sitara 2018.
Powered by WinRace Technologies.