తారక్‌ అలా లేడు..

ఎన్టీఆర్‌ న్యూలుక్‌ అంటూ బొద్దుగా ఉన్న ఎన్టీఆర్‌ ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్‌ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. చిత్ర యూనిట్‌ నుంచి కూడా ఎటువంటి ప్రకటన రాకపోవటంతో అభిమానులు ఈ ఫోటోపై అంచనాలను పెంచుకొంటున్నారు. తాజాగా ఎన్టీఆర్‌ ఫిజికల్‌ ఫిట్‌ నెస్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ ట్విట్టర్లో ఈ ఫోటోపై వివరణ ఇచ్చాడు.‘‘ఇది ఏడాది కిందటి ఫోటో, ఎన్టీఆర్‌ తాజా చిత్రం ఇది కాదు’’ అని ట్వీట్‌లో స్పష్టం చేశాడు. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రంపై డిసెంబర్‌ 12న దర్శకుడు రాజమౌళి కొత్త విషయాలను వెల్లడిస్తారంటున్నాయి చిత్రవర్గాలు.© Sitara 2018.
Powered by WinRace Technologies.