నందమూరితో.. నారా సమావేశం
కొందరు డైరక్టర్లు సినిమాను మొదలుపెడతూనే అతి తక్కువ రోజుల్లోనే పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తారు. అలాంటి దర్శకుల్లో ఒకరు క్రిష్‌ జాగర్లమూడి. ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘యన్‌.టి.ఆర్‌’. చిత్రానికి సంబంధించిన పాత్రలను పరిచయం చేస్తూ వాటిలోని పాత్రల ఫస్ట్‌లుక్‌లను విడుదల చేస్తూ నందమూరి అభిమానులను అలరింపజేస్తున్నారు.ఇవాళ వినాయక చవితి పండుగ సందర్భంగా ఎన్టీఆర్‌తో కలిసున్న ఒక పోస్టర్‌ ఒకటి విడదులైంది. ఆ పోస్టర్‌లో నారా భుజంపై ఎన్టీఆర్‌ చెయ్యివేసి ఏదో చెప్తున్నట్లుంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాత్రను రానా దగ్గుబాటి పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన 1984లో చంద్రబాబు ఎలా ఉంటాడో తెలిపే పస్ట్‌లుక్‌ వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రంలో పలుపాత్రలకు కొంతమంది నటీనటులు ఎంపికైన సంగతి తెలిసిందే!© Sitara 2018.
Powered by WinRace Technologies.