ఒకరికొకరు దగ్గరగా...
హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, అందాల తార సాయి పల్లవి కలిసి నటిస్తున్న చిత్రం ‘పడిపడి లేచే మనసు’. దీపావళి పండుగ సందర్భంగా చిత్రానికి సంబంధించిన ఒక తాజా ఫోటోను చిత్రబృందం విడుదల చేసింది. అందులో శర్వానంద్, సాయిపల్లవిలు ఒకరినొకరు ఆనందంతో హత్తుకొని ఏదో ప్రేమపాట పాడుకున్నట్లుంది. వైవిధ్యమైన ప్రేమ కథలను తెరకెక్కించగల దర్శకుడు హను రాఘవపూడి. గతంలో చిత్రానికి సంబంధించిన కొన్ని పోస్టర్లు, టీజర్‌ అందరిని అలరించిన సంగతి తెలిసిందే. శర్వానంద్‌ ఈ చిత్రంలో ఫుట్‌బాల్‌ ఆటగాడిగా, సాయి పల్లవి వైద్యురాలిగా కనిపించనున్నారట. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌సాంగ్‌ను నవంబర్‌ 12న విడుదల చేయన్నారని సమాచారం.© Sitara 2018.
Powered by WinRace Technologies.