అభిమానికి అండగా నిలిచిన పవన్‌

పవన్‌ కల్యాణ్‌ తెరపైనే కాదు.. నిజ జీవితంలోనూ హీరోనే అన్నది అనేక సందర్భాల్లో రుజువైన సత్యమే. తన అభిమానులు కష్టంలో ఉన్నారని తెలిస్తే చాలు.. సాయం చేయడానికి క్షణం కూడా ఆలోచించని వ్యక్తిత్వం ఆయనది. తాజాగా ఆయన కేన్సర్‌తో బాధపడుతున్న తన అభిమానికి సాయాన్ని అందించి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ప్రకాశం జిల్లా అన్నసముద్రం గ్రామానికి చెందిన బుడిగయ్య పవన్‌కు వీరాభిమాని. కొంతకాలంగా కేన్సర్‌తో వ్యాధితో బాధపడుతున్నారు. కొంత కాలంగా వ్యాధి తీవ్రత పెరగడంతో పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ను చూడాలనుంది అంటూ తన మనసులోని కోరికను స్థానిక జనసేన నేతలకు తెలియజేశాడు. దీంతో వారు బుడిగయ్య విషయాన్ని పవన్‌కు చేరవేయడంతో ఆయన్ని పరామర్శించేందుకు తానే స్వయంగా వాళ్ల ఇంటికొస్తానని మాటిచ్చారు. కానీ, ఈలోపే బుడిగయ్యను అంబులెన్స్‌లో హైదరాబాద్‌ జనసేన పార్టీ కార్యాలయానికి తీసుకురావడంతో అక్కడే ఆయన్ని పరామర్శించారు పవన్‌. బుడిగయ్య ఆరోగ్య పరిస్థితిని అతని కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకొన్నారు. జనసేన పార్టీ తరపున రూ.1లక్ష ఆర్థిక సహాయాన్ని అందించారు. దీంతో పాటు ఆయన ఆరోగ్యం కుదుట పడాలని కోరుకుంటూ ఓ వినాయకుని విగ్రహాన్ని బహూకరించారు.






Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.