పవన్‌ కోసం ఆ తార

టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు పవన్‌ కళ్యాణ్‌ ‘పింక్‌’ రీమేక్‌లో నటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడైన విషయం తెలిసిందే. అత్యంత వేగంగా చిత్ర నిర్మాణం పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. అందులో భాగంగా కథానాయిక ఎంపికలో తనమునకలైందట దర్శకత్వ విభాగం. పవన్‌ సరసన ఇంత వరకు చేయని నాయికని ఎంపిక చేయాలా లేక ‘గబ్బర్‌సింగ్‌’ కాంబినేషన్‌ని మళ్ళీ తెరపైకి తేవాలా ఆలోచిస్తుందట చిత్ర బృందం. పవన్‌ సరసన కొత్త నాయికే అవసరం అయితే లేడిసూపర్‌స్టార్‌ నయనతారను సంప్రదిస్తారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. మరి కొద్ది రోజుల్లో కథానాయిక, సంగీత దర్శకుడిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.