తారక్‌ జిగేలు రాణి వచ్చేసింది!

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ ఇతర తారాగణంపై సన్నివేశాలు తెరకెక్కించగా.. సోమవారం నాడు పూజ సెట్‌లోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. తారక్, పూజలకు సంబంధించిన కీలక సన్నివేశాలను రామోజీ ఫిల్మ్‌ సిటీ, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో తెరకెక్కిస్తున్నట్లు తెలియజేశారు. రాయలసీమ నేపథ్యంగా సాగే ఈ చిత్రం కోసం ఫిల్మ్‌ సిటీలో ఓ భారీ సెట్‌ వేసి చిత్రీకరణ కొనసాగిస్తున్నారు. దసరాకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు గతంలో చిత్ర బృందం ప్రకటించింది. ‘జై లవకుశ’ తర్వాత తారక్‌ నటిస్తున్న సినిమా ఇది. చిత్ర టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనప్పటికీ ‘అసామాన్యుడు’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం. మే 20న ఎన్టీఆర్‌ పుట్టినరోజు కానుకగా ఫస్ట్‌లుక్, టైటిల్‌ను విడుదల చేసే అవకాశముంది. తమన్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నాడు.
సంబంధిత వ్యాసాలు
సంబంధిత ఫోటోలు


© Sitara 2018.
Powered by WinRace Technologies.