అందరూ అనుకున్నదే చేశాడు

‘సాహో’ టాలీవుడ్‌లో ది మోస్ట్‌ ఎవైటింగ్‌ ఫిల్మ్‌. భారీ బడ్జెట్‌తో తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ తెరకెక్కుతున్న చిత్రం. అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల తేదీని ఆగస్టు 15న అని చెప్పడంతో ఆనందంలో మునిగిపోయారు. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడటంతో వారిని నిరూత్సాహ పరిచింది చిత్ర బృందం. అందరూ అనుకున్నట్టుగానే ఆగస్టు 30న వస్తున్నట్లు యువీ క్రియేషన్స్‌ అధికారికంగా ప్రకటించింది. ‘ప్రేక్షకులకు ది బెస్ట్‌ ఔట్‌పుట్‌ ఇచ్చేందుకే వాయిదా వేస్తున్నాం. క్వాలిటీ విషయంలో తగ్గేదిలేదు. యాక్షన్‌ సీన్స్‌ తెరకెక్కించేందుకు ఎక్కువ సమయం పడుతుంద’ని తెలిపింది.

సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.