బాక్సర్‌గా ప్రభాస్‌?

ప్రభాస్‌ కథానాయకుడుగా సుజిత్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కెతున్న చిత్రం ‘సాహో’. యాక్షన్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా టీజర్,పాటలు అభిమానుల్లో అంచనాలు పెంచుతున్నాయి. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండటంతో ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టింది చిత్ర బృందం. తాజాగా ప్రభాస్‌ సామాజిక మాధ్యమం వేదికగా పోస్ట్‌ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌ అయింది. ఇందులో దర్శకుడు సుజిత్‌ బాక్సింగ్‌ కిక్‌ బ్యాగ్‌ను ఎలా కొట్టాలో సూచనలు అందిస్తుంటే ప్రభాస్‌ శ్రద్ధగా గమనిస్తుంటాడు. అయితే ఇది సినిమాలోని సన్నివేశమో కాదో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.