కన్నడ భామ ప్రమోదం
తెలుగు దర్శకలందరితో కలిసి పనిచెయ్యాలని ఆశపడుతున్నానంటోంది నటి ప్రమోదిని. కన్నడలో బాలనటిగా 40 చిత్రాలకు పైగా నటించింది. ‘మెహబూబా’ చిత్రంలో ఆకాష్‌ తల్లిగా నటించింది. బెంగళూరులో పుట్టి పెరిగి అక్కడ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. దర్శకుడు రాఘవేంద్రరావు ఓ తెలుగు సీరియల్‌లో అవకాశం కల్పించి తెలుగులో పరిచయం చేశారు. ఆ తర్వాత నాని చిత్రం ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’తో హను రాఘవపూడి అవకాశం కల్పించారు. ‘ధ్రువ’, ‘ఆక్సిజన్‌’, ‘అంధగాడు’, ‘లై’ , ‘కిరాక్‌పార్టీ’, ‘నా పేరు సూర్య’లలో నటించేందుకు అవకాశం ఇచ్చిన అందరికి చాలా రుణపడి ఉన్నానంటోంది. ఈ మధ్యనే విడుదలైన ‘మెహబూబా’లో అవకాశం ఇచ్చిన పూరి జగన్నాథ్‌కి నేను కృతజ్ఞతలు చెబుతోంది. ప్రస్తుతం ‘రాజుగాడు’, ‘ద్రుష్టి’, ‘రధం’, ‘హుషారు’ చిత్రాల్లో నటిస్తోందీ కన్నడ భామ.© Sitara 2018.
Powered by WinRace Technologies.