చిట్టి దమ్మేంటో చూడండి!

విజ్ఞాన శాస్త్రానికి కూడా అంతుచిక్కని ఓ శక్తిని అదుపు చేయడం కోసం చిట్టి మళ్లీ తిరిగొచ్చాడు. ఈసారి సూపర్‌ పవర్‌తో సరికొత్తగా ముస్తాబైన చిట్టి రోబో ఎలాంటి సందడి చేశాడో తెలియాంటే ‘2.ఓ’ చూడాల్సిందే. రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. అమీజాక్సన్‌ కథానాయిక. అక్షయ్‌కుమార్‌ ప్రతినాయకుడిగా నటించారు. శంకర్‌ దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. నవంబరు 29 చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇటీవలే టీజర్‌ని విడుదల చేశారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌తో కూడిన సన్నివేశాలు, శంకర్‌ మార్క్‌ భారీ హంగులు టీజర్‌లో కనువిందు చేశాయి. ఈ చిత్రానికి పలు హాలీవుడ్‌ సంస్థలు విజువల్‌ ఎఫెక్ట్స్‌ని సమకూర్చాయి. టీజర్‌ విడుదలైన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 32 మిలియన్లపైగా వ్యూస్‌ లభించాయి. చిట్టి రోబో విన్యాసాలు, ప్రతినాయకుడి రూపంలోని అక్షయ్‌కుమార్‌ హంగామా సినిమాపై మరిన్ని అంచనాల్ని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.© Sitara 2018.
Powered by WinRace Technologies.