ప్రీ వెడ్డింగ్‌ వేడుకలో.. సూపర్‌స్టార్‌ స్టెప్పులు
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ముద్దుల తనయ సౌందర్య ప్రీ వెడ్డింగ్‌ రిసెప్షన్‌ చైన్నైలో శనివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో తలైవా డ్యాన్స్‌ చేసి సందడి చేశారు. ‘ముత్తు’ సినిమాలోని ‘ఒకడే ఒక్కడు మొనగాడు’ పాటకు స్టెప్పులు వేశారు. ఆయనతో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్ తల్లి లక్ష్మీ రాఘవేంద్ర కూడా సందడి చేశారు. రజనీ డ్యాన్స్‌ చేస్తున్నప్పుడు తీసిన వీడియోను అభిమానులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. సోమవారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో సౌందర్య.. సినీ నటుడు విషగన్‌ వనగమూడిని వివాహమాడబోతున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం. ఈ వేడుకకు లీలా ప్యాలెస్‌ వేదిక కానుంది. అదే రోజు సాయంత్రం సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా వివాహ విందును ఏర్పాటుచేయనున్నారు.


* నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తులు వీళ్లే..

వివాహ వేడుక జరగబోతున్న సందర్భంగా వధువు సౌందర్య ట్విటర్‌లో పలు ఫొటోలను పోస్ట్‌ చేశారు. ‘మాటలకు అందనంత సంతోషంగా ఉంది. నా జీవితంలో ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు.. నా డార్లింగ్‌ నాన్న, నా ఏంజిల్‌ కుమారుడు వేద్‌, ఇప్పుడు విషగన్‌..’ అని ట్వీట్‌ చేశారు.


View this post on Instagram

A post shared by Thalaivar Fans 🕶 (@thalaivar__fans) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.