దడ పుట్టించే ‘దర్బార్‌’ లుక్‌!

కండలు పెంచి పోరాటానికి సై అంటున్నట్టున్నాడు రజనీకాంత్‌. ఇది చూస్తుంటే విలన్లకు దడ పుట్టించేలా ఉన్నాడు కదా. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘దర్బార్‌’ చిత్రంలోనిదే ఈ లుక్‌. ఎ.ఆర్‌. మురగదాస్‌ దర్శకుడు. తాజాగా ఈ సినిమాలోని రజనీ సెకండ్‌ లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌ లుక్‌ అభిమానుల్ని అలరించింది. దానికి మించి ఈ పోస్టర్‌ ఉందని నెటిజన్లు తెగ కామెంట్స్‌ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్‌ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలోనే విడుదల కానుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.