‘బాహుబలి’కి భళ్లాలదేవ శుభాకాంక్షలు

ప్రముఖ తెలుగు నటుడు ప్రభాస్‌ అంటే ఇప్పుడు యావత్‌ భారతావని మొత్తం తెలుసు. కారణం ‘బాహుబలి’ చిత్రం. ఈ రోజు ప్రభాస్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా అమరేంద్ర బాహుబలికి (ప్రభాస్‌) భళ్లాలదేవుడు (రానా) పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. రానా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్‌తో కలిసి నవ్వుతున్న ఓ ఫోటోను పెట్టి ఆఫోటోకి..‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు సొదరా.. నీ నవ్వు ఎప్పుడూ నిర్మలంగా ఉండాలి. లవ్‌ యూ’’అంటూ పోస్ట్‌ చేశారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహబలి’ చిత్రాలతో ప్రభాస్‌కి ప్రపంచ మొత్తం అభిమానులు ఏర్పడ్డారు. ఈనెల 19న లండన్‌లోని ‘రాయల్‌ ఆల్‌బర్ట్‌ హాల్‌’లో ఇంగ్లీష్‌యేతర చిత్రంగా ప్రదర్శితమై రికార్డుకెక్కింది.

View this post on Instagram

A post shared by Rana Daggubati (@ranadaggubati) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.