సండే.. రాశి ఖన్నా ఆన్‌ సెట్స్‌

దివారం ఎంజాయ్‌ చేద్దామనుకుంటే రాశి ఖన్నాకు కుదరలేదనుకుంటా. అందుకే విచారంగా ఉన్నట్టుంది. ఈ ఫోటో చూస్తుంటే మీకూ అదే అనిపిస్తుంది కదూ. అదేం కాకపోవచ్చు ఎందుకంటే సండే కూడా తాను కష్టపడేది మనల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకే. ప్రస్తుతం ఆమె సెట్‌లో పాల్గొన్న ఫోటోను సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘సండే మూడ్‌ ఆన్‌ సెట్‌’ అని ఓ క్యాప్షన్‌ జతచేసింది. అయితే ఇదే ఏ సినిమానో చెప్పకుండా ఆసక్తి రేకెత్తించింది. రాశి రెండు తెలుగు చిత్రాల్లో కనిపించబోతుంది. సాయి ధరమ్‌ తేజ్ సరసన ‘ప్రతి రోజు పండగే’, నాగచైతన్య- వెంకటేష్‌ కలయికలో వస్తున్న ‘వెంకీ మామ’ చిత్రాలో నటిస్తుండటంతో అది ఏ సినిమా షూటింగ్‌ అయి ఉంటుందా అని అభిమానులు చర్చ మొదలు పెట్టారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.