ఆవిరి ఫస్ట్‌లుక్‌ చూశారా!

తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడు రవిబాబుది విభిన్నమైన శైలి. ఆయన కొత్తకొత్త అంశాలతో సినిమా కథలను తెరకెక్కిస్తుంటారు. అలాంటి సినిమానే ఆవిరి. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్లో వంటగ్యాస్‌ పొయ్యిపై కుక్కర్‌ పెట్టి ఉంది. అందులో కుక్కర్‌పై మూతను కొంచెం పైకి లేపి చూస్తున్న ఓ మహిళ కనిపిస్తుంది. రవిబాబు తెరకెక్కిస్తున్న హారర్‌ థ్రిల్లర్‌ సినిమాకి దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రవిబాబు, నేహా చౌహాన్‌, శ్రీ ముఖి, భరణి శంకర్‌, ముక్తార్‌ ఖాన్‌ తదితరులు నటిస్తున్నా‍రు. సినిమా వాళ్లు చాలామంది సెంటిమెంట్‌ పాటిస్తుంటారు. అలాగే ,అ, పేరు మీద రవిబాబు గతంలో అదుగో, అల్లరి, అమరావతి, ఇప్పుడు ఆవిరి చిత్రాన్ని తీస్తున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.