షాక్‌ ఇస్తున్న బాలయ్ న్యూ లుక్‌!

డీసెంట్‌ హెయిర్‌కట్‌, ఫ్రెంచ్‌ గడ్డంతో ఉన్న ఈ కథానాయకుడు ఎవరనుకుంటున్నారు. ఇంకెవరు టాలీవుడ్‌ అగ్ర నటుడు బాలకృష్ణ అని చెప్పకుండా ఉండలేం కదా. అయితే ఎప్పుడూ కనిపించని సరికొత్త అవతారంలో బాలయ్య దర్శనమివ్వడంతో ఈ లుక్‌ బాలయ్యదేనా అనే సందేహం కలగక మానదు. ఎందుకంటే బాలయ్య కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన స్టైలిష్‌ పాత్ర పోషిస్తున్నారని ముందుగానే ప్రకటించారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఇది రిలీజ్‌ కాకముందే షూటింగ్‌ సమయంలో బాలయ్య ఓ అభిమానితో ఫోటో దిగినట్టు, ఇదే ఆయన నటిస్తున్న చిత్రంలోని లుక్‌ అంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీనిపై అవునని కొందరు, అది బాలయ్య కాదంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చివరగా చిత్ర బృందం బాలకృష్ణ నయావతారాన్ని అభిమానులతో పంచుకోవడంతో నిజమే అని తేలిపోయింది.  ఈ ఫోటో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి గెటప్‌లో బాలయ్యను చూడలేదంటూ చర్చ సాగిస్తున్నారు. హ్యాపీ మూవీస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సోనాల్‌ చౌహాన్‌, వేదిక కథానాయికలు. ప్రస్తుతం బ్యాంకాక్‌లో షూటింగ్‌ జరుపుకుంటుదీ చిత్రం.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.